వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

అభ్యర్థుల ఎన్నికల ఖర్చుపై నిఘా

April 5, 2019

సమావేశంలో మాట్లాడుతున్న గోపాల్‌ ‌ముఖర్జీ
సమావేశంలో మాట్లాడుతున్న గోపాల్‌ ‌ముఖర్జీ

రాష్ట్ర ఎన్నికల ప్రత్యేక వ్యయ పరీశీలకులు గోపాల్‌ ‌ముఖర్జీ
పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థులు చేసే ఎన్నికల ఖర్చుపై ప్రత్యేక నిఘా ఉంచి, వాటి వివరాలను పక్కాగా నమోదు చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రత్యేక పరిశీలకులు గోపాల్‌ ‌ముఖర్జీ సంబంధిత అధికారులను ఆదేశించారు. అభ్యర్థుల ఎన్నికల వివరాల అంశంపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సంబంధిత అధికారులతో గురువారం ఆయన వీడియో కాన్పరెన్స్ ‌నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ పార్లమెంట్‌ ‌నియోజకవర్గ పరిదిలో రూ.70లక్షల వరకు ఖర్చు చేయడానికి కేంద్ర ఎన్నికల కమిషన్‌ అనుమతించిందని గుర్తు చేశారు. అభ్యర్థులు చేసే ప్రతి ఖర్చుపై ప్రత్యేక నిఘా వుంచి లెక్కించాలని అధికారులను ఆయన ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో డబ్బు ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉన్నట్లు ఎన్నికల కమిషన్‌ ‌గుర్తించిన విషయాన్ని ఆయన వెల్లడించారు. వాటి వివరాలను సంబంధిత జిల్లా ఎన్నికల అధికారులకు, అసిస్టెంట్‌ ‌రిటర్నింగ్‌ అధికారులకు అందజేసినట్లు తెలిపారు. ఆ నియోజకవర్గాల పరిధిలో అధిక శ్రద్ద వహించాలని ఆయన ఆదేశించారు. అభ్యర్థులు సోషల్‌ ‌మీడియాలో చేస్తున్న ప్రచారంపై సంబంధిత అధికారులు నిఘా ఉంచాలని ఆయన సూచించారు.