వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

అభివృద్ధిని చూడండి

April 1, 2019

కారు గుర్తుకు వోటెయ్యండి గోదావరిఖని బహిరంగ సభలో సీయం కేసీఆర్‌
దేశగతిని మార్చేలా ప్రజలు నిర్ణయం తీసుకోవాలని, పారల్మెంట్‌ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ అభ్యర్థులను మొత్తంగా గెలపించాలని సిఎం కెసిఆర్‌ ‌పిలుపునిచ్చారు. దేశాన్ని మార్చాల్సిన అవసరం ఉందని, జిమ్మేదార్‌ ‌మనిషిగా మాట్లాడుతున్నా… ఇన్నేల్లు పాలన చేసిన కాంగ్రెస్‌, ‌బిజెపిలు ఎందుకు పాలనలో మార్పులు తీసుకుని రాలేదన్నారు. గోదావరిఖనిలో పెద్దపల్లి పార్లమెంట్‌ ‌నియోజకవర్గ భారీ బహిరంగ సభకు సీఎం కేసీఆర్‌ ‌హాజరై.. ప్రసంగించారు. ప్రాంతీయ పార్టీల కూటమే రేపు అధికారం చేపట్టబోతున్నదని, 16సీట్లు ఇస్కతే దేశం కోట్లాడుతానని అన్నారు. ఈ పదేళ్లలో ప్రభుత్వం రూ.30 లక్షల కోట్లు ఖర్చు చేయబోతోందని టీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌తెలిపారు. సుజల తెలంగాణ, సర్వమతాల తెలంగాణ, సంతోష తెలంగాణ ఆవిష్కతం కాబోతోందని సీఎం కేసీఆర్‌ ‌స్పష్టం చేశారు.ఇదే మైదానంలో అనేక సభలు సమావేశాలు పెట్టుకున్నాం. సుదీర్ఘమైన పోరాటం తర్వాత తెలంగాణ సాధించుకున్నం. ఎలక్షన్లు వస్తే ఆగమాగం కావొద్దు. అందరూ చెప్పేది శాంతంగా వినాలి.. వాస్తవాలు గమనించాలి. నేను ఎక్కువ కన్‌ఫ్యూజ్‌ ‌చేసే మాటలు చెప్పను. టీఆర్‌ఎస్‌ ‌రాకముందు, రాష్ట్రం ఏర్పాటు కాకముందు పరిస్థితి ఎలా వుంది ఇప్పుడెలా వుందిని ఆలోచించాలి. కరెంటు ఆ రోజు ఎలా వుంది ఇవాళ ఎంలా వుంది. పెన్షన్‌ ఆ ‌రోజు ఎంత వచ్చింది.. ఇప్పుడెంత వస్తుంది. నాటికి.. నేటికి చాలా గుణాత్మక మార్పు వచ్చింది. గతంలో తెలంగాణలో 24 లక్షల
మోటార్లుండేవి. పేలిపోయే ట్రాన్స్‌ఫార్మర్లు, కాలిపోయే మోటార్లు. గత పాలకులకు మనసు లేదు కాబట్టే కరెంటు ఇవ్వలేదు. రాహుల్‌-‌మోదీల బొబ్బ చూసి మనం ఆగం కావాల్నా..? దేశాన్ని మంది ఎవరో పాలించినట్టు.. దానికి జిమేదార్‌ ‌వేరేవాళ్లు అయినట్టు రాహుల్‌- ‌మోదీలు మాట్లాడుతున్నారు. అయితే కాంగ్రెస్‌ ‌లేదంటే బీజేపీనా..? కాంగ్రెస్‌, ‌బీజేపీలతో ఎవరికి లాభం జరిగిందని సీఎం కేసీఆర్‌ ‌ప్రశ్నించారు. ప్రధాని మోదీని కలిసి అరగంట మాట్లాడిన. బొగ్గుగనుల్లో పనిచేసే కార్మికలు మిలటరీ కంటే తక్కువేం కాదు. బొగ్గుగని కార్మికుల ఆదాయపన్ను మాఫీ చేయమని అడిగితే చేయలేదు. సింగరేణి కార్మికులకు ఐటీ కట్‌ ‌చేయకుంటే కొంపలు మునిగిపోతయా. పెద్దపల్లి రాజకీయంగా చైతన్యవంతమైన ప్రాంతం. నన్ను బెదిరిస్తున్నారు.. బ్లాక్‌ ‌మెయిల్‌ ‌చేస్తున్నారు. 2001లో నేనెందుకు పంచాయితీ పెట్టుకోవాలి అనుకుంటే తెలంగాణ వచ్చేది కాదు. ఇప్పుడు కూడా దేశం మారాలంటే ఎవరో ఒకరు పంచాయితీ చేయాలి.