ముఖ్యమంత్రికి సూటిగా ప్రశ్నించిన నంద్యాల ముస్లిం మహిళలు
కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలో మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఫారూఖ్ షిబ్లీ ముఖ్య అతిధిగా ఎమ్.హెచ్.పి.ఎస్ మహిళ విభాగం ఆధ్వర్యంలో ఎమ్.హెచ్.పి.ఎస్. రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ముల్లా ఖాజా హుస్సేన్ అధ్యక్షతన అన్న జగన్ అన్న ఎప్పుడు ఇస్తావన్న దుల్హన్ పధకం అనే నినాదంతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి మహిళ విభాగం రాయలసీమ అధ్యక్షురాలు శంషాద్ బేగం మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ముస్లిం మహిళలకు ఇచ్చిన వాగ్దానం దుల్హన్ పథకం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు నుండే అమలు చేస్తామని హా ఇచ్చారని ఈ హాని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఫారూఖ్ షిబ్లీ మాట్లాడుతూ ఎన్ని ప్రభుత్వాలు మారిన ముస్లింల అభివృద్ధి ప్రశ్నర్ధకంగానే మారిందనిముస్లిం సోదరుల ఓట్లు గంపగుత్తగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని ఇప్పుడు పూర్తిగా ముస్లింల సంక్షేమాన్ని విస్మరించడం దారుణం అని అన్నారు. నేను ఉన్నాను, నేను విన్నాను అని మొత్తం ముస్లిం సమాజాన్ని ప్రభావితం చేసి ఓట్లు తీసుకొని సీఎం కుర్చీపై అధిష్టించి దాదాపు రెండున్నర సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు దుల్హన్ పథకం హా మాత్రమే కాకుండా ఏ ఒక్క హా అమలు చెయ్యకుండా పైపెచ్చు మైనారిటీల సంక్షేమం కొరకు కేటాయించిన బడ్జెట్ను నవరత్నాలు అమలు కొరకు దారి మళ్ళించడం అత్యంత బాధాకరం అని అన్నారు.
ఇచ్చిన మాట ప్రకారంగా సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుండి ఎన్నైతే పేద ముస్లింల పెళ్ళిళ్ళు జరిగాయో వారందరికీ లక్ష రూపాయల చొప్పున దుల్హన్ పథకం త్వరితగతిన ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఉర్దూ భాష అభివృధి కొరకు, మద్రాస ఉపాధ్యాయులకు ••ం ద్వారా జీతాలకు, ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది మరియు దక్షిణ భారత దేశంలో కేవలం ఆంధ్ర రాష్ట్రం లోనే నూతన విద్యా విధానాన్ని ఎన్.ఇ.పి 2020 అమలు చెయ్యటం దారుణం అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చే ప్రతి నల్ల చట్టాలను రాష్ట్ర ప్రభుత్వం తుచ తప్పకుండా అమలు చెయ్యటం బిజెపి / ఆర్ఎస్ఎస్ సిద్దాంతాలను అజెండాను ముఖ్యమంత్రి తుచ తప్పక అమలు చెయ్యటమే ఆన్న సంగతి ముస్లిం సమాజం గుర్తించాలని ఆయన అన్నారు. వివిధ రాజకీయ,ప్రజా ముస్లిం సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ మైనారిటీల సంక్షేమం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ప్రతి హా అమలు చెయ్యాలని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు చేస్తున్న కృషి అమోఘం దీనికి మనమందరం కలిసి కట్టుగా మన హక్కులను సాధించు కునేందుకు ప్రయత్నం చేద్దాం అని అన్నారు మరియు అందులో భాగంగా కరపత్రాలను రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చెయ్యాలని, జిల్లా వ్యాప్తంగా మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి కమిటీలు కర్నూల్ కేంద్రంగా చేరుకొని కలెక్టర్లకు వినతి పత్రాన్ని అందించాలని, జిల్లా వ్యాప్తంగా అన్ని మసీదుల్లో బయాన్ చేయించి ప్రజలను సకరించి పెద్ద యెత్తున ర్యాలీ నిర్వహించాలి అని ఈ రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా కార్యాచరణ మరియు ప్రణాళిక రచించటం జరిగింది. ఈ కార్యక్రమంలో ముస్లిం హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఎమ్.డి యునుస్ మైనారిటీ రైట్స్ ఫోరమ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు షేక్ మహబూబ్ బాషా ముస్లిం ఫెడరేషన్ ఆఫ్ ఆంధప్రదేశ్ యువజన విభాగం రాష్ట్ర కన్వీనర్ సుహైల్ రానా, పిడియస్యు జిల్లా ఉపాధ్యక్షులు రఫీ కాంగ్రెస్ పార్టీ సేవదళ్ రాష్ట్ర కార్యదర్శి మస్తాన్ ఖాన్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు అబ్దుల్లా మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు మాలిక్, జిల్లా అధ్యక్షులు స బాషా,ఉస్తాద్ ఇమ్రాన్, ఫిరోజ్ పెద్ద ఎత్తున మహిళలు తదితరులు పాల్గొన్నారు.