Take a fresh look at your lifestyle.

అన్ని వర్గాల అభ్యున్నతి కోసం కెసిఆర్‌ ‌పని చేస్తుంటే..

  • కేంద్రంలో బిజెపి వాతలు, కోతలు పెడుతున్నది
  • పెట్రోల్‌, ‌డీజీల్‌, ‌గ్యాస్‌ ‌ధరల పెంచి వాతలు.. సబ్సీడీల్లో కోతలు
  • ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతూ, కుదవపెడుతూ…ఉన్న ఉద్యోగాలు తొలగిస్తున్నారు బిజెపిపై మంత్రి హరీష్‌ ‌రావు ఫైర్‌
  • ‌మంత్రి సమక్షంలో టిఆర్‌ఎస్‌ ‌పార్టీలో చేరిన రాచపల్లి, సింగపురం గ్రామస్థులు

టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం అధికారంలోకి వొచ్చాక అన్ని వర్గాల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్‌ ‌పని చేస్తున్నారని, ఆ దిశగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని, రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్‌, ‌కేసీఆర్‌ ‌కిట్‌, ‌కల్యాణ లక్ష్మి, 2016 రూ. ఆసరా పెన్షన్‌ ‌వంటి పథకాలు అమలు చేస్తున్నారని మంత్రి హరీష్‌ ‌రావు అన్నారు. బీజేపీ మాత్రం ప్రజలకు వాతలు కోతలు మాత్రమే పెడుతుందని, పెట్రోల్‌, ‌డీజీల్‌, ‌గ్యాస్‌ ‌ధరల పెంచి ప్రజలకు వాతలు పెడుతూ..మరో వైపు సబ్సిడీల్లో కోతలు విధించిందని ఆయన దుయ్యబట్టారు. ఇలాంటి పార్టీ వల్ల ప్రజలకు ఒరిగిందేమిటని ప్రశ్నించారు. నల్ల ధనం వెనక్కు తెచ్చి ప్రతీ అకౌంట్‌ 15 ‌లక్షల రూపాయలు వేస్తానని చెప్పిన బీజేపీ ఏడేళ్ల పాలనలో ఒక్క రూపాయి నల్ల ధనం వెనక్కు తెచ్చిందా….ఒక్క రూపాయి అయినా మీ అకౌంట్లలో పడ్డాయా అంటూ ప్రజలను అడిగారు. పెద్ద నోట్లు రద్దుతో నల్ల ధనం బయటకు వొస్తుందని చెప్పి వేయి రూపాయల నోట్లు రద్దు చేసిన బీజేపీ ప్రభుత్వం రెండు వేల పెద్ద నోటును తెచ్చింది. కాని నల్ల ధనం మాత్రం బయటకు రాలేదు. కాని మనమంతా మాత్రం బ్యాంకు వద్ద లైన్లు కట్టాల్సిన పరిస్థితి తెచ్చారని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతూ, కుదవపెడుతూ… ఉద్యోగాలు తొలగిస్తున్నారు. ఇలాంటి బీజేపీకి బుద్ది చెప్పాలని, హుజూరాబాద్‌ ‌వోటర్లు బీజేపీ పాలన తీరును గమనించి వాత పెట్టాలని పిలుపునిచ్చారు.

హుజూరాబాద్‌ అభివృద్ధి తమ బాధ్యత లని, ఇక్కడి సమస్యలన్నీ తెరాస ప్రభుత్వమే పరిష్కరిస్తుందని ఆయన మంత్రి హామీ ఇచ్చారు. ఇల్లందకుంట మండలం రాచపల్లికి చెందిన 150 మంది బీజేపీ, కాంగ్రెస్‌ ‌పార్టీలకు చెందిన కార్యకర్తలు తెరాస తీర్థం పుచ్చుకున్నారు. రాచపల్లికి చెందిన యువ నేత అశోక్‌ ‌యాదవక్‌ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున యాదవులు, ముస్లింలు సింగపురంలో మంత్రి హరీష్‌ ‌రావు సమక్షంలో తెరాసలో చేరారు. వారికి మంత్రి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం సింగపురంకు చెందిన 150 మంది యువకులు తెరాసలో చేరారు. ఈ సందర్భంగా హరీష్‌ ‌రావు మాట్లాడుతూ..ఏడేళ్లు మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్‌ ‌హుజూరాబాద్‌ను పట్టించుకోదని, నాలుగు వేల ఇళ్లు మంజూరు చేస్తే తోటి మంత్రులంతా తమ నియోజకవర్గాల్లో ఇళ్లు కట్టించారని, కాని ఒక్క ఇల్లు కట్టించని మంత్రి ఈటల రాజేందరని అన్నారు.

మహిళల సమావేశానికి ఒక్క మహిళా భవనాన్ని కట్టించలేదని, పైనుంచి రైతు బంధు, కల్యాణ లక్ష్మి పేదలను ఆదుకుంటుంటే వాటిని పరిగ ఏరుకోవడం అంటూ ఎద్దేవా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు ఈటల పార్టీ బీజేపీ ఏం చేసిందో ప్రజలకు తెలుసని హరీష్‌ ‌రావు అన్నారు. నల్ల వ్యవసాయ చట్టాలపై పోరాట చేస్తా అని చెప్పి ఆ నల్ల చట్టాలకు ఈటల మద్ధతు ఇస్తున్నారని అన్నారు.. బావుల కాడ, బోర్ల కాడ విద్యుత్‌ ‌మీటర్లు పెడతామంటున్నారని, కేంద్ర మంత్రి కాన్వాయ్‌ ‌రైతులు ధర్నా చేస్తే వాళ్ల మీదకు ఎక్కించగా దాదాపు పది మంది చనిపోయినట్లు వార్తలు చూశామని, ఇంత అమానుషంగా ప్రాణాలు తీస్తారా అని మండిపడ్డారు. ఇలాంటి బీజేపీకి ఎందుకు వోటు వేయాలో అలోచించాలని, బీజేపీ ద్వారా రైతులకు, యువతకు, మహిళలకు ఏం లాభం జరిగిందో ఆలోచించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు హరీష్‌ ‌రావు.

Leave a Reply