Take a fresh look at your lifestyle.

అధికారులపై కలెక్టర్‌ ఆ‌గ్రహం

బూర్గంపాడు మండలం లో జిల్లా కలెక్టర్‌ ‌యంవి రెడ్డి పర్యటించి పునరావాస కేంద్రాలను సోమవారం తనిఖీ చేశారు. పలుపు పునరావాస ప్రాంతాల్లో పర్యటించి స్థానికులతో మాట్లాడి బాధితుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో పనిచేస్తున్న బూర్గంపాడు కార్యదర్శి ఇతర సిబ్బంది పైన జిల్లా కలెక్టర్‌ ఆ‌గ్రహం వ్యక్తం చేశారు.వారి పనితీరు పై గతంలో షోకాజ్‌ ‌నోటీసులతో సరిపెట్టుకున్న వారి పనితీరులో మార్పు లేకపోవడంతో   అధికారులపై కలెక్టర్‌ ఆ‌గ్రహం చెందటం రెండవసారి కానీ ప్రభుత్వ అధికారుల పనితీరులో ఏ మాత్రం మార్పు లేకపోవడం గమనార్హం.భారీగా వరద రావడంతో బూర్గంపాడు మండలం అతలాకుతలం అవుతుంది. బూర్గంపాడు ప్రాంతంలో  రహదారులు  వరద నీరు తో ఎక్కడికక్కడ రాకపోకలు నిలిచిపోయాయి. నీళ్లు చేరటంతో పంట పొలాలు భారీగా నీట మునగడంతో రైతులు, సామాన్యులు సైతం వరద తాకిడికి నానా ఇబ్బందులు పడుతున్నారు. నామమాత్రంగా అధికారులు ఏర్పాట్లు చేస్తూ చేతులు దులుపుకుంటున్నారు అనే ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో కలెక్టర్‌ ‌వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Leave a Reply