వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

అధికారంగా విమోచన దినం ..!

September 10, 2019

ఫోటో: న్యూఢిల్లీ కాంటినెంటల్‌ ‌క్లబ్‌లో తెలంగాణ విమోచనానికి సంబంధించి ఫోటో ఎగ్జిబిషన్‌ ‌తిలకిస్తున్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌.  (‌పక్కచిత్రంలో తెలంగాణ విమోచనం సంబంధించిన పుస్తకాన్ని విడుదల చేసిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఢిల్లీ బిజెపి అధ్యక్షుడు మనోజ్‌ ‌తివారీ, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌.)
ఫోటో: న్యూఢిల్లీ కాంటినెంటల్‌ ‌క్లబ్‌లో తెలంగాణ విమోచనానికి సంబంధించి ఫోటో ఎగ్జిబిషన్‌ ‌తిలకిస్తున్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌. (‌పక్కచిత్రంలో తెలంగాణ విమోచనం సంబంధించిన పుస్తకాన్ని విడుదల చేసిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఢిల్లీ బిజెపి అధ్యక్షుడు మనోజ్‌ ‌తివారీ, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌.)

బీజేపీ డిమాండ్‌ .. ‌నాడు నిజాంకు,నేడు కేసీఆర్‌కు వ్యతిరేకంగా ప్రజలు తిరగబడతారు : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి
తెలంగాణ విమోచన దినంపై ఢిల్లీలో ఎగ్జిబిషన్‌
సర్ధార్‌ ‌వల్లభాయ్‌ ‌పటేల్‌ ‌యజ్ఞంలా సంస్థానాల విలీనం కోసం కృషి చేసారని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌ ‌రెడ్డి అన్నారు. మంగళవారం తెలంగాణ సాయుధపోరాట యోధుల చిత్ర ప్రదర్శనను ఢిల్లీలోని కానిస్టిట్యూషన్‌ ‌క్లబ్‌లో కేంద్ర •ం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి ప్రారంభించారు. సెప్టెంబర్‌ 17‌న తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ఫొటో ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్‌ ‌సంస్థానాన్ని భారత్‌లో విలీనం చేసేందుకు వల్లభాయ్‌ ‌పటేల్‌ ఎన్నో చర్చలు జరిపారని, అప్పటి నవాబ్‌ ‌భారత్‌లో విలీనం అయ్యేందుకు ఒప్పుకోక స్వతంత్ర రాజ్యంగా ఉంటామని ఐక్యరాజ్య సమితిని ఆశ్రయించాడని, అలాంటి నవాబ్‌కు వ్యతిరేకంగా భారత్‌లో విలీనం అయ్యేందుకు అప్పటి ప్రజలు పోరాటం చేశారని అన్నారు. నిజాం నవాబు ఖాసిం రజ్వితో ఎన్నో అరాచకాలు చేయించారని అన్నారు. నిజాంపై యుద్ధం చేసింది ఇండియన్‌ ఆర్మీ అని ఆయన గుర్తుచేశారు. భారతదేశం స్వేచ్చగా స్వాతంత్ర వేడుకలు చేసుకుంటుంటే హైదరాబాద్‌ ‌సంస్థానం మాత్రం నిజాం కబంధ హస్తాల్లో చిక్కుకొని విలవిలలాడిందని, దీంతో నిజాం నవాబు వల్లభాయ్‌ ‌పటేల్‌ ‌పోరాట స్పూర్తికి తలొగ్గి ఓటమిని అంగీకరించి భారత్‌లో విలీనానికి ఒప్పుకున్నారని తెలిపారు. హైదరాబాద్‌ ‌విమోచన దినోత్సవాన్ని పక్కనే ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాలు అధికారికంగా జరుపుతున్నా తెలంగాణ ప్రభుత్వం జరపకపోవడం దురదృష్టకరమని ఆయన అన్నారు. మజ్లీస్‌ ‌పార్టీ చేతిలో కీలుబొమ్మలుగా ఉన్న టీడీపీ, కాంగ్రెస్‌, ‌టీఆరెస్‌ ‌స్వాతంత్య్ర వేడుకలు జరపడం లేదని, టీఆరెస్‌ ‌పార్టీ తెలంగాణ ఏర్పడ్డాక అధికారికంగా నిర్వహిస్తామని హామీ ఇచ్చినా కూడా….మజ్లీస్‌ ఒత్తిడికి తలొగ్గి నిర్వహించడం లేదని కిషన్‌ ‌రెడ్డి ఆరోపించారు. విమోచన దినోత్సవం జరపకుండా అధికారంలో ఏ పార్టీ ఉన్నా వాళ్ళను బ్లాక్‌ ‌మెయిల్‌ ‌చేసే పార్టీ మజ్లీస్‌ ‌పార్టీ అని అసదొద్దీన్‌, అక్భరొద్దీన్‌ ఒవైసీ లను చెరో భుజంపై మోస్తూ కేసీఆర్‌ ‌తెలంగాణను పాలిస్తున్నారని ఎద్దేవాచేశారు. నెహ్రూ జమ్మూకాశ్మీర్‌ ‌లోని కొంతమంది మత ఛాందస వాదులతో కలిసి ఆర్టికల్‌ 370 ‌తీసుకొచ్చారని, ఆర్టికల్‌ 370 ‌మూలంగా భారత ప్రజలు 70 ఏళ్లుగా ఎంతో నష్టపోయ్యారని ఆయన అభిప్రాయపడ్డారు. ఆర్టికల్‌ 370‌లో ప్రాథమిక హక్కు అంశమే లేదు కాబట్టి ప్రాథమిక హక్కులు అడుగుతున్న వారు భారత్‌ ‌పార్లమెంట్‌ ఆమోదించిన అనేక హక్కులను ఎందుకు అడగలేదని, ఇక తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించకుండా టీఆరెస్‌ ‌ప్రజలను వంచించిందని అన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడే విమోచన దినోత్సవం అధికారికంగా జరుగుతుందని, స్వాతంత్య్ర వేడుకలు, గణతంత్ర వేడుకలు జరిపినట్లు తెలంగాణలో అధికరింగా విమోచన ఉత్సవాలు నిర్వహించుకునే రోజు త్వరలోనే వస్తుందని కల్వకుంట్ల, ఒవైసీ కుటుంబాల చేతుల్లో తెలంగాణ బందీగా మారిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య తెలంగాణ లక్ష్యంగా మాత్రమే ఉద్యమాలు, ఆత్మబలిదానాలు జరిగాయని, కానీ రజాకార్ల వారసుల కనుసన్నల్లో పనిచేసే ప్రభుత్వం కోసం ఆత్మబలిదానాలు జరగలేదని అన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవం విషయంలో కేసీఆర్‌ ‌నిర్ణయం తీసుకోవాలని, లేకపోతే తగిన మూల్యం చెల్లించుకుంటారని కిషన్‌ ‌రెడ్డి హెచ్చరించారు. అంతకుముందు తెలంగాణ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ ‌మాట్లాడుతూ.. తెలంగాణలో ఎందరో పోరాట యోధులు ఉన్నారని, వారి వీరగాథలను దిల్లీలో ప్రదర్శించామన్నారు. నిజాంకు వ్యతిరేకంగా చాకలి ఐలమ్మ వీరోచిత పోరాటం చేసిందని గుర్తు చేశారు. నిజాం దారుణాలకు బలైన కుటుంబాలను పరామర్శిస్తున్నామని తెలిపారు. తెలంగాణ పోరాటాల చరిత్రను మరుగునపడేలా కల్వకుంట్ల చరిత్ర రాస్తున్నారని వ్యాఖ్యానించారు. యాదాద్రిలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆయన చరిత్రను చెక్కుకుంటున్నారని, కల్వకుంట్ల కుటుంబ చరిత్రనే తెలంగాణ భావితరాలకు చెబుతున్నారని ఆరోపించారు. మజ్లీస్‌ ‌ప్రోద్భలంతో తెలంగాణ పోరాటాల చరిత్రను కాలగర్భంలో కలిపేశారని విమర్శించారు. తెలంగాణ విమోచన చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని లక్ష్మణ్‌ ‌డిమాండ్‌ ‌చేశారు. విమోచనదినాన్ని అధికారికంగా జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని లక్ష్మణ్‌ ‌తెలిపారు. కేసీఆర్‌ ‌దిగివచ్చి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్‌ ‌చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు బండి సంజయ్‌, అరవింద్‌, ‌ఢిల్లీ భాజపా అధ్యక్షుడు మనోజ్‌ ‌తివారీ, జాతీయ బీసీ కమిషన్‌ ‌మెంబర్‌ ఆచారి, పెద్దిరెడ్డి, గద్దె రామ్మోహన్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు.