Take a fresh look at your lifestyle.

అత్యవసర వినియోగానికి కోవాగ్జిన్‌కు అనుమతి మంజూరు చేసిన డబ్ల్యుహెచ్‌ఓ

‌జెనీవా, నవంబర్‌ 03 : ‌ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యుహెచ్‌ఓ) ‌బుధవారం భారత్‌ ‌బయోటెక్‌ ‌తయారు చేసిన కోవిడ్‌ ‌టీకా కోవాక్సిన్‌కు అత్యవసర వినియోగానికి అనుమతి నిచ్చింది. ఈ టీకాను అత్యవసర వినియోగ జాబితాలో(ఎమక్జెన్సీ యూజ్‌ ఆఫ్‌ ‌లిస్టింగ్‌-ఈయూఎల్‌) ‌చేర్చడానికి డబ్ల్యుహెచ్‌ఓ ఆమోదం తెలిపింది.

ఈ మేరకు డబ్ల్యుహెచ్‌ఓ ‌బుధవారం ట్వీట్‌ ‌ద్వారా తెలిపింది. ఈ గుర్తింపు వల్ల టీకాను ప్రపంచ దేశాలకు అందించే వీలు కలుగుతుంది. ఇక నుంచి ఈ టీకా తీసుకున్నవారు విదేశాలకు వెళ్లడానికి ఎటువంటి ఆంక్షలు కానీ, క్వారంటైన్‌లో ఉండాల్సిన అవసరం కానీ ఉండదు.

Leave a Reply