వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

అత్తి వరదరాజస్వామిని దర్శించుకున్న సీఎం కెసిఆర్‌

August 12, 2019

ఫోటో: కంచిలో అత్తి వరదరాజస్వామిని దర్శించుకున్న సిఎం కెసిఆర్‌
ఫోటో: కంచిలో అత్తి వరదరాజస్వామిని దర్శించుకున్న సిఎం కెసిఆర్‌ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన పూజారులు

కాంచీపురం : తమిళనాడులోని కాంచీపురంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అత్తి వరద రాజు స్వామి వారిని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌దంపతులు దర్శించుకున్నారు. వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య స్వామి వారికి కేసీఆర్‌ ‌కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు కేసీఆర్‌ ‌దేవస్థానానికి చేరుకోగానే ఆలయ అధికారులు, అర్చకులు ఘన స్వాగతం పలికారు. దర్శనం అనంతరం వేదపండితులు ఆశీర్వచనాలతో పాటు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కేసీఆర్‌ ‌కుమార్తె, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత, ఏపీఐఐసీ ఛైర్మన్‌ ‌రోజా తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌తన కుటుంబ సభ్యులతో కలిసి బేగంపేట విమానాశ్రయం నుంచి విమానంలో బయల్దేరిన కేసీఆర్‌ ‌తొలుత రేణిగుంట చేరుకొని అక్కడినుంచి రోడ్డు మార్గంలో కంచి చేరుకున్నారు. నగరిలో ఆయనకు ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్‌ ఆర్కే రోజా స్వాగతం పలికారు. అనంతరం కాంచీపురం చేరుకోగానే అక్కడ ఆలయ అధికారులు, వేదపండితులు సీఎంకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీఎం అత్తివరదరాజ స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేసీఆర్‌ ‌వెంట ఆయన సతీమణి శోభ, కుమార్తె, మాజీ ఎంపీ కవితతో పాటు ఆర్కే రోజా, తదితరులు ఉన్నారు. కాంచీపురం నుంచి కేసీఆర్‌ ‌తిరుమల వెళ్లనున్నారు. అక్కడ శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకొని తిరిగి హైదరాబాద్‌కు చేరుకుంటారు.