Take a fresh look at your lifestyle.

అతివృష్టి నష్టాన్ని ఎప్పుడు పూడ్చుతారో సీఎం కెసిఆర్‌ ‌చెప్పాలి

తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షులు డాక్టర్‌ ‌చెరుకు సుధాకర్‌ ‌డిమాండ్‌

‌ముషీరాబాద్‌, ‌సెప్టెంబర్‌ 06 (‌ప్రజాతంత్ర విలేఖరి) : అంచనాలకు మించిన వర్షం పోయిన సంవత్సరాన్ని దాటి చెరువులు నింపడంతో పాటు పంటలను, రోడ్లు నివాస స్థలాలను కూడా ముంచెత్తుతున్నాయని చెరువులకు, రోడ్లకు గండ్లు పడి పంటపొలాలు, ఇండ్లు నిట మునిగి ప్రజలు కొన్ని ప్రాంతాల్లో గజగజ వణుకుతున్నా ప్రభుత్వం నుండి స్పందన లేదని తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షులు డాక్టర్‌ ‌చెరుకు సుధాకర్‌ అన్నారు. హైదరాబాద్‌, ‌వరంగల్‌ ‌కొన్ని పట్టణాల్లో లోతట్టు గుడిసెలు మునిగి నిరాశ్రయులైన ప్రజలకు పోయిన సంవత్సరం వరద సాయం వలెనే మొండి చేయి చూపిస్తారా అని ప్రశ్నించారు. హుజూరాబాద్‌ ఎన్నికలు ఢిల్లీకి పోయి వాయిదా వేయించిన ఆనందంలో అతివృష్టి భాదితదులు గుర్తున్నారా అని అన్నారు. ఐపియస్‌ ఆఫిసర్ల పెంపు కోసం ప్రధానిని కలిసిన కేసిఆర్‌ ‌వరద, అత్యవసర వైద్యసేవలకు స్పెషల్‌ ఆఫీసర్లను డిసాస్టర్‌ ‌మేనేజ్‌మెంట్‌ ‌కోసం ఎక్కువ వేయమని ఎందుకు అడగరో జవాబు చెప్పాలన్నారు. కాళేశ్వరం నుండి ఎత్తి పోసిన వేల కోట్ల రూపాయలు ఖర్చు నీళ్ళు గంగ పాలవుతుంటే ఇప్పటికైనా గ్రావిటీతో పారే ప్రజెక్టులకు శ్రీకారం చుట్టరా అని మండిపడ్డారు.

దుబారా, దండుగమారి ఖర్చుకు కేరాఫ్‌గా ఉన్న కేసిఆర్‌ ‌కేంద్రం నుండి వరదసాయం, కరోనా సాయం అరకొరగానే వొస్తున్నాయని, అన్యాయం జరుగుతుందని బహిరంగ లేఖ రాయాలని బండి సంజయ్‌తో పాటు మేము డిమాండ్‌ ‌చేస్తున్నామన్నారు. రాష్ట్రానికి నిధుల కేటాయింపులో మొండి చేయి చూపిస్తున్న కేంద్ర ప్రభుత్వం వైఖరిని నిలదీస్తే ఎక్కడ తమ అసమర్ధత, అవినీతి బయటపెడతారో అని నోరు మూసుకున్న కేసిఆర్‌ ‌వైఖరి తెలంగాణకు తీవ్ర నష్టం కలిగిస్తున్నదన్నారు. పత్తితో పాటు వేల కోట్ల రూపాయల పంటలు నీట మునిగిపోయాయని, మానేరుకు, మల్లన్న సాగర్‌కు ఎత్తి పోసిన నీళ్ళు కిందకి జారి వరదల్లో ఊర్లు, పొలాలు కొట్టుకుపోతున్నా, నీళ్ళ మంత్రి హరీష్‌రావుకు ఈటెల రాజేందర్‌ను తిట్టుడు కాక తీరిక దొరుకుతలేదన్నారు.

ఢిల్లీలో తెలంగాణ భవన్‌కు ముగ్గు పోస్తున్న రోజు తెలంగాణలో బడుగుల, పేదల జీవితాలు ముగ్గు బుట్టలయి ఆగమవుతున్నది ముఖ్యమంత్రికి పట్టదా అని అన్నారు. రోగాలతో, పంట ముంపుతో పుట్టెడు కష్టాల్లో ఉన్న తెలంగాణ బిడ్డల బాధను చూసి తెలంగాణ తల్లికి కన్నీళ్ళు రావా అన్నారు. దళితబందును ఎవడు ఆపుతాడో చూస్తానని రంకెలేస్తున్న కేసిఆర్‌ ‌బృందానికి చిద్రమైన తెలంగాణ ముఖచిత్రం, దళితుల విషన్నవదనం కనపడడం లేదా అన్నారు. ఎవడూ మెచ్చని ఈ బడాయి ఆపి, వరద భాదితుల్ని, అనారోగ్య పీడుతుల్ని, రైతుల్ని కాపాడడం కోసం ఏ బంధు ప్రకటిస్తారో కేసిఆర్‌ ‌వెంటనే ప్రకటించాలన్నారు.

Leave a Reply