Take a fresh look at your lifestyle.

అగ్రపథంలో అందాల విందు చేస్తున్న గోవా రాష్ట్రం

భారతదేశ నైరుతి అరేబియన్‌ ‌తీరప్రాంత గోవా రాష్ట్ర దక్కన్‌ ‌పీఠ భూమిగా పశ్చిమ కనుమలతో వేరు చేయబడి ఉంది. ‘పనాజీ’ కేంద్రంగా కోంకన్‌ అధికారిక భాష మాట్లాడే గోవా ప్రాంతం ప్రకృతి రమణీయతలకు ప్రసిద్ధి గాంచింది. ఉత్తరాన మహారాష్ట్ర, పశ్చిమ మరియు దక్షిణాన కర్నాటక, పశ్చిమాన సముద్ర తీరప్రాంతంగా పర్యాటకులకు స్వర్గతుల్యంగా నిలుస్తున్నది.

నేడు ‘గోవా రాష్ట్ర అవతరణ దినోత్సవం

భారతదేశ నైరుతి అరేబియన్‌ ‌తీరప్రాంత గోవా రాష్ట్ర దక్కన్‌ ‌పీఠ భూమిగా పశ్చిమ కనుమలతో వేరు చేయబడి ఉంది. ‘పనాజీ’ కేంద్రంగా కోంకన్‌ అధికారిక భాష మాట్లాడే గోవా ప్రాంతం ప్రకృతి రమణీయతలకు ప్రసిద్ధి గాంచింది. ఉత్తరాన మహారాష్ట్ర, పశ్చిమ మరియు దక్షిణాన కర్నాటక, పశ్చిమాన సముద్ర తీరప్రాంతంగా పర్యాటకులకు స్వర్గతుల్యంగా నిలుస్తున్నది.

15 ఆగష్టు 1947న స్వాతంత్య్రం పొందినప్పటికీ గోవా మాత్రం పోర్చుగీస్‌ ‌పాలనలోనే కొనసాగింది. 450 ఏండ్ల పోర్చిగీస్‌ ‌పాలన అనంతరం 19 డిసెంబర్‌ 1961‌న భారత ప్రభుత్వం నిర్వహించిన ‘ఆపరేషన్‌ ‌విజయ్‌’ ‌త్రివిధ దళాల దాడితో 36 గంటల్లోనే డమన్‌, ‌డయ్యు ద్వీపాలతో పాటు గోవా కూడా విముక్తమై కేంద్రపాలిత ప్రాంతాలుగా భారత దేశంలో అంతర్భాగం అయ్యాయి. 30 మే 1987న భారత ప్రభుత్వం గోవాకు (25వ రాష్ట్రంగా) రాష్ట్ర హోదాను ఇవ్వడంతో డయ్యూ మరియు డమన్‌లు కేంద్ర పాలిత ప్రాంతాలుగానే మిగిలి పోవలసి వచ్చింది. వైశాల్యంలో అతి చిన్న రాష్ట్రంగా మరియు జనాభాలో నాలుగవ చిన్న రాష్ట్రంగా గోవా అరేబియా సముద్ర ఒడ్డున ఉన్నది. దేశంలోనే అత్యధిక ‘పర్‌ ‌కాపిటా జిడిపి’ ( దేశంలో 2.5 రెట్లు అధికంగా) కలిగిన రాష్ట్రంగా గోవా ఉన్నత స్థితిలో ఉంది. ఉన్నత జీవన ప్రమాణాలతో అధిక మౌళిక వసతులు కలిగిన గోవాలో 65 మైళ్ల తీరప్రాంతంతో పాటు అందమైన బీచ్‌లు, విదేశీ పర్యాటకులకు ప్రసిద్ధిగాంచింది.


కోంకన్‌ ‌ప్రాంతంగా పిలువబడే గోవా రాష్ట్రం 30 మే 1987 నుంచి ‘రాష్ట్ర అవతరణ దినోత్సవాలను’ ఘనంగా నిర్వహించు జరుగుతున్నది. గోవా ప్రాంతంలో జువారీ, మండోవి,తెరెకోల్‌, ‌చపోర, గల్గిబాగ్‌, ‌కుంబర్జువా కెనాల్‌, ‌తల్పోన మరియు సాల్‌ అనబడే ఏడు నదులు ప్రవహిస్తున్నాయి. అతి పెద్ద పట్టణంగా వాస్కోడెగామ ఉండగా గోవారాష్ట్రం రెండు జిల్లాలుగా విస్తరించింది.

గోవా రాష్ట్ర జనాభా 15.22 లక్షలు ఉంటుంది. హిందువులు మరియు క్రిస్టియన్లు అధికంగా ఉన్న గోవాలో ముస్లిమ్‌లు, సిక్కులు, జైనులు కూడా కొద్ది జనాభా ఉంది. కోంకణి, మరాటీ మరియు ఆంగ్ల భాష అధికంగా మాట్లాడే గోవాలో వ్యవసాయం ప్రధాన జీవనోపాధిగా దూసుకెలుతున్నది. ఖనిజ సంపద అధికంగా ఉన్న గోవాలో పారిశ్రామిక ప్రగతి కూడా చెప్పుకోదగినదే. కొబ్బరి తోటల నీడన బీచ్‌లు, స్వర్ణమయ ఇసుక తిన్నెలు, ఆకు పచ్చ పరిసరాలు, వైవిధ్య భరిత సాంస్కృతిక వారసత్వ విలక్షణతలు, అద్భుత పురాతన చర్చిలు, దేవాలయాలు, కోటలు, పోర్చిగీస్‌ ‌కళానైపుణ్య స్మారక కట్టడాలు మరియు తూర్పు-పడమరల సాంస్కృతిక మేలుకలయికలతో గోవా ప్రముఖ రాష్ట్రంగా, ‘వరల్డ్ ‌హెరిటేజ్‌ ‌సైట్‌’‌గా కూడా గుర్తించబడి దేశ విదేశీ పర్యాటకులను ఆకర్షిస్తున్నది. ‘పర్యాటకుల సర్గం’గా కొనియాడబడే గోవా ప్రత్యేకతల్ని ఆస్వాదిస్తూ, ఆధునికత పేరున సాంస్కృతిక విధ్వంసం మరియు వారసత్వ సంపదకు విఘాతం కలుగకుండ కాపాడుకోవలసిన బాధ్యత మనందరి మీద ఉన్నది.

డా: బుర్ర మధుసూదన్‌ ‌రెడ్డి
విశ్రాంత ప్రధానాచార్యులు, ప్రభుత్వ డిగ్రీ పిజీ కళాశాల,  కరీంనగర్‌ – 9949700037

 

Leave a Reply