వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

అక్టోబర్‌ 21 ‌హుజూర్‌నగర్‌ ఉప ఎన్నిక

September 21, 2019

మహరాష్ట్ర, హరియాణా..
అసెంబ్లీ ఎన్నికలకు మోగిన నగారా
హుజూర్‌నగర్‌ ‌సహా 64 స్థానాలకు ఉప ఎన్నికలు
అక్టోబర్‌ 21‌న పోలింగ్‌..24‌న ఫలితాలు
రెండు రాష్ట్రాల అసెంబ్లీఎన్నికల తేదీలు వెలువడ్డాయి. ఇందులో మూడు రాష్ట్రాలతో బాటు తెలంగాణాలోని హుజుర్‌ ‌నగర్‌ ‌స్థానం ఉంది. ఈ సారి ఒకే విడతలో మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్‌ 21‌న మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించి అక్టోబర్‌ 24‌న ఫలితాలు వెల్లడించనున్నారు. సెప్టెంబర్‌ 27‌న నోటిఫికేషన్‌తో ప్రారంభమైన నామినేషన్ల దాఖలు ప్రక్రియ ఆఖరి తేది అక్టోబర్‌ 4‌గా నిర్ణయించారు. నామినేషన్ల పరిశీలన అక్టోబర్‌ 5 ‌వరకు, తదుపరి నామినేషన్ల ఉపసంహరణ ఆఖరి తేదీ అక్టోబర్‌ 7‌గా ప్రకటించారు.ఇక ఈ సారి విశేషం ఏమంటే ఎన్నికలో ప్లాస్టిక్‌పై పూర్తిస్థాయిలో నిషేధం విధించారు. ఈ సారి ఎన్నికల్లో మహారాష్ట్ర వోటర్లు 8.94 కోట్లు, హర్యానా వోటర్లు 1.82 కోట్లు ఉన్నారు. యథావిధిగానే ఈ సారి ఎన్నికల్లో సైతం యువతదే ప్రధానపాత్ర. దేశవ్యాప్తంగా మొత్తం 64 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఇక తెలంగాణలో హుజూర్‌నగర్‌ అసెంబ్లీ స్థానానికి ఎన్నికల షెడ్యూల్‌ ‌ప్రకటించిన ఈసి అక్టోబర్‌ 21‌నే హుజూర్‌ ‌నగర్‌ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరపాలని నిశ్చయించింది. అక్టోబర్‌ 24‌న వెలువడనున్న ఫలితాలతో అధికార తెరాస, కాంగ్రెస్‌ల మధ్య పోటీలో ప్రజలు ఎవరికి పట్టం కట్టనున్నారో తెలుస్తుంది.
నేటి నుంచి జిల్లాలో ఎన్నికల కోడ్‌ అమలుః రజత్‌ ‌కుమార్‌ ‌హుజూర్‌నగర్‌ అసెంబ్లీ స్థానానికి అక్టోబర్‌ 21‌వ తేదీన ఉప ఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఉపఎన్నికకు షెడ్యూల్‌ ‌విడుదలైన నేపథ్యంలో సూర్యాపేట జిల్లాలో నేటి నుంచి ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌ ‌కుమార్‌ ‌తెలిపారు. 2019 జనవరి 1 నాటి ఓటర్ల జాబితా ప్రకారమే ఉపఎన్నిక నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాకు సంబంధించి ప్రభుత్వం విధానపరమైన ప్రకటనలు చేయకూడదని ఆయన అన్నారు. సూర్యాపేట జిల్లాలో మంత్రులు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనకూడదని, అదేవిధంగా సూర్యాపేట జిల్లాలో ఉద్యోగుల బదిలీలు చేపట్టరాదని స్పష్టం చేశారు. హుజూర్‌నగర్‌ ఏపీ సరిహద్దులో ఉన్నందున మరింత నిఘా పెడతామన్నారు. మద్యం, డబ్బు సరఫరాపై ప్రత్యేక నిఘా పెట్టనున్నట్లు చెప్పారు. సి-విజిల్‌ ‌యాప్‌ ‌ద్వారా ఉల్లంఘనలపై ఫిర్యాదులు చేయవచ్చని రజత్‌ ‌కుమార్‌ ‌పేర్కొన్నారు.
హుజూర్‌నగర్‌ ‌టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సైదిరెడ్డి
షెడ్యూల్‌ ‌వెలువడిన కొద్ది గంటల్లోనే అధికార టీఆర్‌ఎస్‌ ‌తన అభ్యర్థిని ప్రకటించింది. టీఆర్‌ఎస్‌ ‌తరఫున శానంపూడి సైదిరెడ్డి బరిలోకి ఉంటారని తెలిపింది. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌ ‌నిర్ణయం తీసుకున్నారు. గతేడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి ఉత్తమ్‌కుమార్‌ ‌రెడ్డి చేతిలో సైదిరెడ్డి ఓటమిపాలయ్యారు. తాజాగా, మరోసారి ఆయనకు టీఆర్‌ఎస్‌ అవకాశం కల్పించింది. హుజూర్‌నగర్‌ ‌టిక్కెట్‌ ‌కోసం ఎన్నారై దొంతిరెడ్డి నరసింహా రెడ్డి తీవ్ర పోటీ ఎదురైనట్టు ప్రచారం సాగింది. సైదిరెడ్డి, దొంతిరెడ్డి నరసింహా రెడ్డి ఒకే నియోజకవర్గానికి చెందినవారు. టీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీ రామారావును దొంతిరెడ్డి కలిశారని, ఆయనకు టిక్కెట్‌పై హా లభించిందని వార్తలు
వెలువడ్డాయి. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ ‌పెన్సిల్వేనియాలోని శాస్త్రవేత్తగా నరసింహారెడ్డి పనిచేశారు. ఆంధప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్మోహన్‌ ‌రెడ్డికి ఆయన అత్యంత సన్నిహితుడని, ఆయనకు టిక్కెట్‌ ఇస్తారని ప్రచారం జరిగినా చివరకు సైదిరెడ్డివైపే కేసీఆర్‌ ‌మొగ్గుచూపారు. మరోవైపు కాంగ్రెస్‌ ‌పార్టీ ఇప్పటికే పద్మావతి పేరును దాదాఫు ఖరారు చేసినట్లేనని ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ ‌కుమార్‌రెడ్డి సతీమణి అయిన పద్మావతి 2018 ఎన్నికల్లో కోదాడ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. నేడోరేపో ఆమెపేరునుసైతం కాంగ్రెస్‌ అధిష్టానం ప్రకటించనుంది. మరోవైపు బీజేపీ సైతం బలమైన అభ్యర్థిని బరిలోకి దింపేందుకు కసరత్తు చేస్తుంది.
టీఆర్‌ఎస్‌ ‌గెలుపు ఖాయం – మంత్రి జగదీశ్‌ ‌రెడ్డి
హుజూర్‌నగర్‌ ఉపఎన్నికలో టీఆర్‌ఎస్‌ ‌విజయం నల్లేరుపై నడకేననీ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. మెజారిటీ ఎంతుస్తున్నదే ప్రధానాంశమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో జరిగిన అనుభవాలను దృష్టిలో ఉంచుకొని తగు జాగ్రత్తలు తీసుకుంటామనీ, కాంగ్రెస్‌ ‌నేతలంతా కలిసి వచ్చినా టీఆర్‌ఎస్‌ ‌విజయాన్ని ఆపలేరని ఆయన అన్నారు. కాంగ్రెస్‌ ‌నేతల ఐక్యత పీతల కలయిక వంటిదని ఆయన విమర్శించారు. అసెంబ్లీ, స్థానిక సంస్థలు ఎన్నికల ఫలితాలు పునరావృతమవుతాయన్నారు. ఉత్తమ్‌కుమార్‌ ‌రెడ్డి హుజూర్‌నగర్‌లో స్థానికేతరుడని, ఆయన ఆటలిక్కడ ఏమి సాగవన్నారు. పోటీ ఏమైనా ఉంటే కాంగ్రెస్‌తోనే కానీ, బీజేపీ ప్రభావం ఏ మాత్రం ఉండదన్నారు. టీఆర్‌ఎస్‌ను గెలిపించేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని ఈ సందర్భంగా మంత్రి అన్నారు.