Take a fresh look at your lifestyle.

అం‌బేద్కర్‌ ఓపెన్‌ ‌యూనివర్సిటీలో.. అతి తక్కువ గౌరవ వేతనాలు

దేశంలో మొట్టమొదటి సార్వత్రిక విశ్వవిద్యాలయమైన డాక్టర్‌ ‌బి.ఆర్‌ అం‌బేద్కర్‌ ఓపెన్‌ ‌యూనివర్సిటీ దేశంలోనే ప్రఖ్యాతి గాంచిన విశ్వవిద్యాలయం. ‘‘ఎడ్యుకేషన్‌ ఎట్‌ ‌డోర్‌ ‌స్టెప్‌’ అనే నినాదంతో దూరవిద్యతో విద్యను అందరికీ చేరవేస్తున్న విశ్వవిద్యాలయం. ఈ విశ్వవిద్యాలయం అందిస్తున్న అండర్‌ ‌గ్రాడ్యుయేట్‌ ‌మరియు పోస్ట్ ‌గ్రాడ్యుయేట్‌ ‌కోర్సులకు సంబంధించి తరగతులను బోధించటానికి అకడమిక్‌ ‌కౌన్సిలర్లు ఉంటారు. వారు నిర్ణీత సంఖ్యలో ఉన్న తరగతులను ప్రతి ఆదివారం సంబంధిత అధ్యయన కేంద్రాలలో తరగతులను బోధిస్తారు. ఇలా బోధించడానికి వారికి ఇచ్చే గౌరవ వేతనం అండర్‌ ‌గ్రాడ్యుయేట్‌ ‌కోర్సులకు ప్రతి క్లాస్‌కి కేవలం నాలుగు వందల రూపాయలు మరియు పోస్ట్ ‌గ్రాడ్యుయేట్‌ ‌కోర్సులకు ఐదు వందల రూపా యలు. ఈ గౌరవ వేతనం కేవలం నిర్ణీత సంఖ్యలో ఉన్న తరగ తులకు మా త్రమే. ఇవి కాకుండా బోధనలో కౌన్సిలర్లకు మరే ఇతర అదనపు వేతనాలు ఉండవు. మరియు తరగ తుల సంఖ్య కూడా పరిమితం మాత్రమే. ఇంత తక్కువ గౌరవ వేతనం ఇవ్వడం వల్ల అకాడమిక్‌ ‌కౌన్సిలర్లకు సరిపోవడం లేదు. ఎందుకంటే దూరవిద్యలో విద్యను అభ్యసిస్తున్న అభ్యర్థులకు తరగతులు తీసుకోవాలి మరియు యూనివర్సిటీ విడుదల చేసిన ప్రవేశాలు నింపడానికి కౌన్సిలర్లు వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలను, విద్యార్థులును చైతన్య పరిచి వర్సిటీలో జాయిన్‌ అయ్యే విధంగా వారికి తగిన కౌన్సెలింగ్‌ ఇవ్వాలి. ఈ విధంగా ఓపెన్‌ ‌యూనివర్సిటీ ప్రవేశాలలో కౌన్సిలర్ల పాత్ర చాలా కీలకం, కాబట్టి వారికి గౌరవ వేతనాలు ప్రతి క్లాస్‌కి వెయ్యి రూపాయల వరకు ఇవ్వాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇప్పుడు సెమిస్టర్‌ ‌విధానంలో ప్రధాన సబ్జెక్టులకు కేవలం ఆరు తరగతులు మాత్రమే నిర్వహిస్తున్నారు. కానీ ఈ ఆరు తరగతులు అభ్యర్థులకు పూర్తిస్థాయిలో సిలబస్‌ ‌పూర్తవడానికి వీలు కాదు కాబట్టి క్లాసుల సంఖ్య కూడా కనీసం పది తరగతుల వరకైనా పెంచాలి. ఇది కాకుండా పరీక్షల సమయంలో విధులు నిర్వహించే ఇన్విజిలేటర్లు యొక్క వేతనం కూడా చాలా తక్కువ. దానిని కూడా రెట్టింపు చేయాలి. ఎందుకంటే ఆన్‌ ‌లైన్‌ ‌విధానంలో జవాబు పత్రాల స్కానింగ్‌ ‌చేస్తున్నారు కాబట్టి దానికి సంబంధించినటువంటి అన్ని రకాల పనులను ఇన్విజిలేటర్లు పరీక్షల సమయంలో నిర్వహిస్తున్నారు. పరీక్షల విభాగం సంబంధించిన అన్ని రకాల విధుల(పరిశీలకులు, స్క్వాడ్‌, ఇన్విజిలేటర్‌) ‌గౌరవ వేతనాలు కూడా వెంటనే పెంచాలి. ఆన్‌ ‌లైన్‌ ‌మూల్యాంకనంపై అవగాహన కల్పించడానికి ఆయా ప్రాంతీయ కేంద్రాలు అనుగుణంగా వారికి ప్రత్యేక ఓరియంటేషన్‌ ‌సదస్సులు కూడా నిర్వహించాలి. ప్రతి రెండు సంవత్సరాలకు లేదా మూడేళ్లకు ఒకసారి ఈ గౌరవం వేతనాలను పెంచేవిధంగా యూనివర్సిటీ అధికారులు నిర్ణయం తీసుకుంటే అకాడమీ కౌన్సిలర్‌లకు మేలు జరుగుతుంది. దానివల్ల అకాడమీ కౌన్సిలర్లు ఇంకా కష్టపడి యూనివర్సిటీకి అధిక సంఖ్యలో ప్రవేశాలు వచ్చే విధంగా తమ వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా అందిస్తారు. దీని వల్ల మంచి ఫలితాలు వచ్చి విశ్వవిద్యాలయం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుంది.
– రాజేష్‌, ‌హైదరాబాద్‌.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy