Take a fresh look at your lifestyle.

హరీష్‌ అభిమానులు హ్యాపీ!

 గులాబీ దళపతి కేసీఆర్‌ ‌సమక్షంలో టిఆర్‌ఎస్‌ ‌పార్టీ సభ్యత్వం తీసుకుంటున్న హరీష్‌రావు
గులాబీ దళపతి కేసీఆర్‌ ‌సమక్షంలో టిఆర్‌ఎస్‌ ‌పార్టీ సభ్యత్వం తీసుకుంటున్న హరీష్‌రావు

నిజంగా నిన్నటి(గురువారం)రోజు మాజీమంత్రి, సిద్ధిపేట శాసనసభ్యుడు తన్నీరు హరీష్‌రావు అభిమానులకు, అనుచరులకు, టిఆర్‌ఎస్‌ ‌పార్టీ క్యాడర్‌కు హ్యాపీ డే. పార్టీ సభ్యత్వం తీసుకున్న సందర్భంలో ముఖ్యమంత్రి, గులాబీ దళపతి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మాజీమంత్రి తన్నీరు హరీష్‌రావును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు హరీష్‌ ‌రావు అభిమానులకు సంతోషకరమైనవని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఒక మాట అనేక అనుమానాలకు,ప్రశ్నలకు సమాధానమే చెప్పింది. పార్టీలో నెలకొన్న ఆగాధం,గ్యాసిపిస్కు ఫుల్‌ ‌స్టాప్‌ ‌పెట్టేలా చేసిందనే చెప్పాలి.
రాష్ట్రంలో రెండోసారి గులాబీ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత హరీష్‌ ‌రావును ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ ‌రావు తన కేబినెట్లోకి తీసుకోని విషయం తెలిసిందే. దీనికి తోడుగా కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి కావడానికి నీటి పారుదల శాఖ మంత్రిగా పని చేసిన హరీష్‌ ‌రావును పిలువకపోవడంతో.. హరీష్‌ ‌రావును కేసీఆర్‌ ‌పూర్తిగా పక్కన పెట్టాడని.. హరీష్‌ ‌రావు కూడా పార్టీ మారుతారంటూ సోషల్‌ ‌మీడియాలో, పత్రికలలో, ఎలక్ట్రానిక్‌ ‌మీడియాలోనూ రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. హరీష్‌ ‌రావుకు మంత్రి పదవి ఇవ్వకపోవడం, కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభంలో పూర్తిగా విస్మరించడాన్ని ముఖ్యంగా హరీష్‌ ‌రావు అభిమానులు, పార్టీ కార్యకర్తలు,నాయకులతో పాటుగా సాధారణ జనాలు సైతం తట్టుకోలేక పోతున్నారు. సరిగ్గా ఇదే క్రమంలో.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌హరీష్‌ ‌రావును ఉద్దేశించి చేసినట్లుగా వచ్చిన వార్తలు ఆయన అభిమానులు,పార్టీ శ్రేణుల ఆనందానికి అవధుల్లేకుండా చేస్తుందని చెప్పాలి. సిఎం కేసిఆర్‌ ‌నోట వచ్చిన ఒకే ఒక మాట… హరీష్‌ ‌రావును పక్కన పెడుతారంటూ సాగుతోన్న ప్రచారానికి ఫుల్‌ ‌స్టాప్‌ ‌పడేలా చేసింది.‘‘నాతో పాటు హరీష్‌ ‌రావు కష్టపడి పార్టీని నిలబెట్టాడు’’అని సీఎం కేసీఆర్‌ ‌మాట్లాడిన మాటలు ఇప్పుడు తెగ వైరల్‌ అవుతున్నాయి. ఈ వ్యాఖ్యలు హరీష్‌ అభిమానుల్లో పండుగ వాతావరణం తెచ్చిపెట్టేలా చేశాయి. ఈ నెల 27న్‌ ‌టిఆర్‌ఎస్‌ ‌పార్టీ కేంద్ర కార్యాలయంలో(తెలంగాణ భవన్‌)‌విస్తృత స్థాయి సమావేశానంతరం మెదటి సభ్యత్వాన్ని కేసీఆర్‌ ‌తీసుకున్నారు.ఆ తర్వాత రెండో సభ్యత్వం మాజీ మంత్రి హరీష్‌రావు నమోదు చేసుకున్నారు. ఈ సందర్బంగా కేసీఆర్‌ ‌హరీషను పిలిచి సభ్యత్వ పుస్తకాలు అందజేసారు. అక్కడనే సిఎం కేసీఆర్‌ ‌హరీష్‌ను ఉద్దేశించి ‘2001లో తాను తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించినప్పుడు తనతో పాటు హరీష్‌ ‌కష్టపడి పార్టీని నిలబెట్టారని’ఈ సందర్బంగా వాఖ్యానించారు. సిద్దిపేటలో పార్టీ కార్యాలయాల శంకుస్థాపన బాగా జరిగిందని హరీష్‌ ‌రావును స్వయంగా సీఎం కేసీఆర్‌ అభినందించడంతో అక్కడ ఉన్నవారందరి ముఖాల్లో ఆనందం వెల్లివిరిసినట్లు చెబుతున్నారు. ఇదిలా ఉంటే, గత కొంత కాలంగా పార్టీలో హరీష్‌ను పక్కనబెడుతున్నారనీ, మరీ ముఖ్యంగా సిఎం కేసీఆర్‌ ‌హరీష్‌కు ప్రాధాన్యతను తగ్గించడం లేదనీ…ఇంకా చెప్పాలంటే కలవడానికి కూడా అపాయింట్‌మెంటు ఇవ్వడం లేదన్న ప్రచారం జరుగుతున్న విషయం విధితమే. అయితే, ఉన్నఫలంగా పార్టీని కష్టపడి నిలబెట్టారనీ సాక్షాత్తు సిఎం కేసీఆరే హరీష్‌ ‌గురించి చెప్పడంతో… దటీజ్‌ ‌హరీష్‌ ‌రావు అంటూ..ఆయన అభిమానులు, అనుచరులు, పార్టీ శ్రేణులు సోషల్‌ ‌మీడియాలో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అందరి ముందు హరీష్‌ ‌రావు తనతో పాటు కష్టపడ్డాడని కేసీఆర్‌ ‌మాట్లాడంతో… ఇప్పటి వరకు చోటుచేసుకున్న, నెలకొన్న మనస్పర్థలు, అభిప్రాయ బేధాలు, అసంతృప్తి,పార్టీ మార్పుపై వస్తున్న అనేక ప్రచారాలు, ఊహాగానాలన్నీ మటుమాయం అయినట్లే అని హరీష్‌ అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఇదే వ్యాఖ్యలపై సర్వత్రా చర్చ సాగుతోంది. తాజాగా సీఎం కేసీఆర్‌ ‌చేసిన వ్యాఖ్యలతో …కేసీఆర్‌ ‌వద్ద హరీష్‌ ‌రావు పలుకుబడి, ప్రాధాన్యత ఏమాత్రం తగ్గలేదని…కేసీఆర్‌ ‌తన మంత్రి వర్గాన్ని ఎప్పుడు విస్తరించినా… హరీష్‌ ‌రావుకు తప్పకుండా చోటు ఉంటుందన్న ధీమాను, ఆశాభావంను వ్యక్తం చేస్తున్నారు ఆయన అభిమానులు. చూడాలి మరి!

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy