Take a fresh look at your lifestyle.

అం‌తరిక్షంలో అద్భుతాలు

ఓ వైపు చంద్రయాన్‌…
‌మరోవైపు ఆదిత్యుడి ఆంతరంగం
పరిశోధనలకు పదును పెడుతున్న శాస్త్రవేత్తలుచంద్రయాన్‌ ‌కక్షలో నిర్దిష్టంగా సాగుతోంది. ఇస్రో తన మేధోశక్తితో పంపిన చంద్రాయాన్‌-2 ‌సక్రమ మార్గంలో పయనిస్తూ జాబిల్లివైపు దూసుకుని పోతోంది. ఖగోళ పరిశోధనలు కొత్త పుంతలు తొక్కుతున్న వేళ ఇప్పటికే అనేక రహస్తాలు ఛేదిస్తున్న మానవుడు జాబిల్లి గుట్టును తెలుసుకోబోతున్నాం. అంగారకుడి రహస్యాలను శోధిస్తున్న వేళ రోవర్‌ ‌ద్వారా అక్కడి వాతావరణం గురించి పరిశోధిస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన పరిశోధనలు ఒక ఎత్తయితే ఆదిత్యుడి రహస్యాలను తెలుసుకోవాలన్న ప్రయత్నం కూడా చేయాలని ప్రపంచ దేశాలు ఉవ్వీళ్లూరుతున్నాయి. మండుతున్న అగ్నిగోళం ముందుకు వెళ్లి నిలబడగలాలంటే ఎంతో ధైర్యం కావాలి. మామూలు ఎండవేడిమికి తట్టుకోలేని మనం కోట్ల ఫారిన్‌ ‌హీట్‌ ‌వేడి కలిగిన ఆదిత్యుడిని చేరడం సామాన్య విషయం కాదు. కానీ ఇప్పటి వరకు అనేక అసాధ్యాలను సుసాధ్యం చేసిన పరిశోధకులు తమ మస్తిష్కానికి పదను పెట్టారు. అంగారక పరిశోధనలు పురోగతిలో ఉండగానే ఆదిత్యుడిపై ఆసక్తి పెరిగింది. మండే అగ్నిగోళం సూర్యుడి గుట్టువిప్పడమే లక్ష్యంగా ఇప్పటికే తొలి అడుగు పడింది. నాసా ప్రయోగించిన పార్కర్‌ ‌సోలార్‌ ‌ప్రోబ్‌ ‌సూర్యుని వద్దకు ప్రయాణాన్ని ప్రారంభించింది.ఉపగ్రహాల చరిత్రలోనే ప్రోబ్‌ అత్యంత వేగంగా కదులుతుందని నాసా శాస్త్రవేత్తలు ప్రకటించారు. సూర్యునిపై ఉండే దుర్భరమైన వాతావరణ పరిస్థితులను, రేడియోధార్మికతను తట్టుకునేగలిగేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇతర ఉపగ్రహాలతో పోలిస్తే 500 రెట్లు ఎక్కువగా ఉష్ణాన్ని తట్టుకోగలిగే పటిష్టవంతమైన కవచాన్ని ఏర్పాటు చేశారు. సూర్యుని విషయంలో ఉన్న అనేక సందేహాలను, రహస్యాలను ఈ స్పేస్‌ ‌క్రాఫ్ట్ ‌చేధిస్తుందని శాస్త్రవేత్తలుజ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సూర్యుడి ఉపరితల వాతావరణ వలయమైన కరోనాలోకి వెళ్లడం ఈ పరిశోధన లక్ష్యం. ప్రోబ్‌ ‌శుక్రుడి గురుత్వాకర్షణ శక్తిని వినియోగించుకుని తన కక్ష్య నిడివిని తగ్గించుకుని, వేగాన్ని మార్చుకుని ఏడు సంవత్సరాల అనంతరం 2024నాటికి సూర్యుని ఉపరితలాన్ని చేరుకుంటుంది. సూర్యుని చుట్టూ 24 కక్ష్యలలో తిరిగి కరోనాను అధ్యయనం చేస్తుంది. అక్కడ భూమిని ప్రభావితం చేసే ప్రదేశాన్ని గుర్తిస్తుంది. పార్కర్‌ ‌సోలార్‌ ‌ప్రోబ్‌ ‌భూమి, సూర్యుల మధ్య దీర్ఘవృత్తాకార కక్ష్యలోకి ప్రవేశిస్తుందని, ఈ కక్ష్యలో ఒక భ్రమణం పూర్తి చేయడానికి 88రోజులు పడుతుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. చంద్రుడి ద కాలుడి నట్లు అమెరికా చెప్పుకున్నా ఆ తరవాత ఎందుకనో దానిలో పురోగతి కానరాలేదు. దీంతో ఆ ప్రయోగంపై ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా అనేక అనుమానాలు తొలుస్తున్నాయి. అయితే చంద్రయాన్‌ ‌ద్వారా భారత అంతరిక్ష పరిశోధాన సంస్థ ఇస్రో ప్రయాగాలు ఫలించాలయి. చంద్రుడిపై నీటి జాడలు ఉన్నాయని మనవారు గుర్తించారు. ఈ దశలో ఓ వైపు అంగారక గ్రహంపై పరిశోధనలను రోవర్‌ ‌ముమ్మరం చేసింది. ఇదిలావుండతానే ఆదిత్యుడి గుట్టు తెలుసుకునే ప్రయత్నంలో అమెరికా నాసా ప్రయోగం విజయం దిశగా సాగుతోంది. సూర్యునికి అత్యంత సపంగా వెళ్లే ఉపగ్రహం కావడంతో ఈ ఉపగ్రహానికి అనేక ప్రత్యేకతలున్నాయి. దీని రూపకల్పనలో శాస్త్రవేత్తలు
ఏళ్లకొద్ది గడిపారు. ఆదిత్యుడి గుట్టును విప్పేందుకు ఇది ఏడేళ్ల సుదీర్ఘ ప్రయాణం చేయనుంది. సౌర బాహ్యపొర కరోనా, అంతరిక్షంపై అది చూపుతున్న ప్రభావం ద ప్రధానంగా ఇది దృష్టి కేంద్రీకరించనుంది. సౌర తుపానులతో ఉపగ్రహాలు దెబ్బతింటాయి. కక్ష్యలోని వ్యోమగాముల ప్రాణాలకూ వీటితో ముప్పు పొంచివుంది. రేడియో కమ్యూనికేషన్‌ ‌వ్యవస్థలు, పవర్‌ ‌గ్రిడ్‌లనూ ఇవి ధ్వంసం చేయగలవు. తాజా ప్రోబ్‌తో ఈ ముప్పులను మెరుగ్గా అంచనా వేసేందుకు వీలుపడుతుందని నాసా తెలిపింది. భూమిపై సంభవించే పరిణామాలతోపాటు విశ్వాన్ని మెరుగ్గా అర్థం చేసుకొనేందుకు ఈప్రయోగం తోడ్పడుతుంది. ఏడేళ్లలో ఏడుసార్లు శుక్రుడి గురుత్వాకర్షణ శక్తితో ఇది కక్ష్యను పెంచుకుంటుంది. క్రమంగా ఇది సూర్యుడికి చేరువవుతుంటుంది. చివరగా భానుడి ఉపరితలం నుంచి 38లక్షల మైళ్ల ఎత్తులో ఉంటుంది. ఈ సమయంలో దీని వేగం గంటకు ఏడు లక్షల కి.. ఉంటుంది. అత్యంత వేగంగా కదులుతున్న వ్యోమనౌకగా ఇది రికార్డు సృష్టించనుంది. సూర్యుడికి దగ్గరగా వెళ్లినప్పుడు ఇది 1,377 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతను ఎదుర్కొంటుంది. మొత్తంగా అంతరిక్ష పరిశోధనల్లో అనేక అద్భుతాలు త్వరలోనే ఆవిష్క•తం కానున్నాయి.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy